ప్రభుత్వ ఫార్మసిస్టుల సేవలు ఎనలేనివి

3చూసినవారు
ప్రభుత్వ ఫార్మసిస్టుల సేవలు ఎనలేనివి
ప్రపంచ ఫార్మసిస్టుల దినోత్సవం సందర్భంగా తొర్రూరు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య బృందం ఆధ్వర్యంలో శుక్రవారం ఫార్మసిస్టులను ఘనంగా సత్కరించారు. ప్రభుత్వ ఫార్మసిస్టుల సేవలు ఎనలేనివని, ముఖ్యంగా ఫార్మసిస్టు మహేష్ అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని వైద్య బృందం కొనియాడింది. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి, ఫార్మసిస్టులకు తినిపించి, శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో వైద్య బృందం, ల్యాబ్ టెక్నీషియన్స్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్