జనగామ జిల్లా దేవరుప్పుల మండల కేంద్రంలో గుర్తు తెలియని వ్యక్తులు ట్రాక్టర్ బ్యాటరీలను దొంగిలించడం కలకలం రేపుతోంది. గొల్లపల్లి, మనుపహడ్ గ్రామాలకు చెందిన రైతులు తమ పొలాల్లో ట్రాక్టర్లను నిలిపి ఉంచగా, దుండగులు 5 ట్రాక్టర్ల నుండి బ్యాటరీలను అపహరించారు. ఈ ఘటనతో రైతులు ఆర్థికంగా నష్టపోయినట్లు వాపోతున్నారు.