పాలకుర్తి నియోజకవర్గ పరిధిలోని తొర్రూరు - నర్సంపేట రహదారిపై ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో గుర్తూరుకు చెందిన నవీన్ అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. నవీన్ తన బైక్‌పై వెళ్తుండగా వాహనం అదుపుతప్పి కిందపడిపోవడంతో తలకు బలమైన గాయాలై, రక్తస్రావంతో మరణించాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేశారు.