రైతులు, ప్రజలు పరిశ్రమల సౌకర్యార్థం ట్రాన్స్ఫార్మర్ మంజూరు
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని అమ్మపురం, ఖానాపురం, గుర్తురు, సోమారం, జీకే తండ గ్రామాల ప్రజలు, పరిశ్రమలు, రైతుల విద్యుత్ అవసరాల కోసం ఖానాపురం విద్యుత్ ఉప కేంద్రంలో 8 ఎంవీఏ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేశారు. ఎల్నినో ప్రభావంతో విద్యుత్ వినియోగం పెరగడంతో ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు ఈ ట్రాన్స్ఫార్మర్ ను ఏర్పాటు చేసినట్లు జిల్లా విద్యుత్ సూపరింటెండెంట్ ఇంజనీర్ కె దర్శన్ కుమార్, తొర్రూరు విద్యుత్ డివిజనల్ ఇంజనీర్ ఎన్ కృష్ణ తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ అధికారులు పాల్గొన్నారు.