రాష్ట్రవ్యాప్త ఐపీఎస్ అధికారుల బదిలీల్లో భాగంగా, వరంగల్ పోలీస్ కమిషనరేట్‌కు కొత్త బాస్ వచ్చారు. ప్రస్తుతం వరంగల్ సీపీగా ఉన్న సన్‌ప్రీత్ సింగ్‌ను సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్‌గా బదిలీ చేశారు. ఆయన స్థానంలో 2012 బ్యాచ్‌కు చెందిన మహిళా ఐపీఎస్ అధికారి శ్వేతా వరంగల్ కొత్త పోలీస్ కమిషనర్‌గా నియమితులయ్యారు. ప్రస్తుతం ఆమె హైదరాబాద్ నార్త్ జోన్ జాయింట్ కమిషనర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఈ మేరకు ప్రభుత్వం తాజాగా ఆదేశాలు జారీ చేసింది.