జర్నలిస్టుల కుటుంబాలకు అండగా నిలవాలి.. గజ్జెల వినోద్ రెడ్డి
సీనియర్ వర్కింగ్ జర్నలిస్ట్ గజ్జెల వినోద్ రెడ్డి ఆదివారం పాలకుర్తిలో జర్నలిస్ట్ పెందోట కిషన్ చారి తండ్రి లింగాచారి దశదినకర్మ సందర్భంగా మాట్లాడుతూ వర్కింగ్ జర్నలిస్టులు ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వారిని ప్రభుత్వం అన్ని విధాల ఆదుకోవాలని కోరారు. జర్నలిస్టులకు అందజేసే హెల్త్ కార్డుల విషయంలో కుటుంబ సభ్యులందరికీ అన్ని రకాల వైద్యం అందించే విధంగా మంజూరు చేయాలని, అలాగే జర్నలిస్టులకు రైల్వే పాసులు కూడా మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని ఆయన విజ్ఞప్తి చేశారు.