
ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలి
ఆత్మకూరు, దామెర, నడికుడా మండలాల కాంగ్రెస్ నాయకులు, గ్రామ, బూతు అధ్యక్షులతో పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి స్థానిక సంస్థల ఎన్నికలపై సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని, ప్రతి ఇంటికి ప్రభుత్వ సంక్షేమ పథకాలను తీసుకెళ్లి వారి గెలుపునకు కృషి చేయాలని ఆయన సూచించారు.




































