నమ్మదగిన సమాచారం మేరకు గీసుకొండ పోలీసులు జాన్పాకలో ఇంటి వద్ద గుడుంబా అమ్ముతున్న బాదావత్ విజయ్ కుమార్, బోడ సురేష్‌లను అరెస్ట్ చేశారు. వారి వద్ద 15 లీటర్ల ప్రభుత్వ నిషేధిత గుడుంబాను స్వాధీనం చేసుకుని, పంచుల సమక్షంలో సీజ్ చేసి, వారిపై కేసు నమోదు చేసినట్లు సీఐ విష్వేశ్వర్ తెలిపారు.