ఒకరిపై 24 కేసులు.. మరొకరిపై 9 కేసులు

2చూసినవారు
ఒకరిపై 24 కేసులు.. మరొకరిపై 9 కేసులు
మే 29న ఎస్సారెస్పీ కెనాల్ సమీపంలో వాహన తనిఖీలు నిర్వహించగా, అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఇద్దరు వ్యక్తులు పారిపోయేందుకు యత్నించగా పోలీసులు వారిని పట్టుకున్నారు. రాంపూర్, ఎలుకుర్తి, శాయంపేట, గొర్రెకుంట పరిసర ప్రాంతాల్లో ఎస్సారెస్పీ కాల్వ వద్ద ఉన్న మోటర్లు, ఇనుప సామగ్రి, బైక్ను చోరీ చేసినట్లు వారు ఒప్పుకున్నారు. ఏ1 సూర రవిపై 24 కేసులు, ఏ2 ఇమ్రాన్పై 9 కేసులు ఉన్నట్లు గీసుకొండ సీఐ విష్వేశ్వర్ తెలిపారు. వారి వద్ద నుండి 35 వేల విలువైన వస్తువులు స్వాధీనం చేసుకొని రిమాండ్కు తరలించినట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్