హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్ రవి, శాయంపేట తహసిల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా భూభారతి, సాదాబైనామా, జాతీయ రహదారులు, మీ సేవా సర్టిఫికెట్స్, కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ వంటి రికార్డులను పరిశీలించారు. మండలానికి సంబంధించిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ పురోగతిని తహసిల్దార్ ప్రవీణ్ కుమార్ ను అడిగి తెలుసుకున్నారు.