వరంగల్ గీసుకొండ మండలం మచ్చాపూర్ గ్రామంలో జాతీయ రహదారి-163జీ నిర్మాణం కోసం భూములు కోల్పోయిన రైతులతో జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద సోమవారం ఆర్బిట్రేషన్ నిర్వహించారు. భూసేకరణకు సంబంధించి రైతుల అభ్యంతరాలు, పరిహారం అంశాలపై వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. రైతులు తమ సమస్యలను, డిమాండ్లను కలెక్టర్ దృష్టికి తీసుకురాగా, ప్రభుత్వ నిబంధనల మేరకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్, ఆర్డీవో, తాసిల్దార్, సంబంధిత అధికారులు, రైతులు పాల్గొన్నారు.