
అసైన్డ్ ఇళ్ల స్థలాల రిజిస్ట్రేషన్‌కు అవకాశం
AP: రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అసైన్డ్ ఇళ్ల స్థలాల రిజిస్ట్రేషన్‌కు అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రెవెన్యూ అధికారులు జారీ చేసిన ఒరిజినల్ పట్టా లేదా సర్టిఫైడ్ కాపీని, ఇంటి పన్ను రశీదును తప్పనిసరిగా సమర్పించాలి. సర్వే నంబర్, ప్లాట్ నంబర్ ఆధారంగానే రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి. వారసత్వ విషయంలో ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ కచ్చితంగా ఉండాలి. నకిలీ పత్రాలు సమర్పిస్తే కఠిన చర్యలు తప్పవని ప్రభుత్వం హెచ్చరించింది.




