ఉమ్మడి వరంగల్ జిల్లా గీసుకొండ మండలం అరెపల్లె హవేలి గ్రామంలో బొడ్డెమ్మ పండుగ వేడుకలు శుక్రవారం రెండో రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా చిన్నారులు సాంప్రదాయ పద్ధతిలో బొడ్డెమ్మను పూలతో అలంకరించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పాటలు పాడుతూ, చప్పట్లు కొడుతూ ఆనందోత్సవాల్లో పాల్గొన్నారు. ఈ వేడుకల్లో మధులిక, మున్నీ, వైషుతో పాటు పలువురు చిన్నారులు పాల్గొన్నారు.