వరంగల్ ధర్మారం గ్రామపంచాయతీ వద్ద, బీఆర్ఎస్ నాయకులు, కార్పొరేటర్ సుంకరి మనిషా శివకుమార్, వితంతువులతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలభిషేకం చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన రూ.4,000 వితంతు పెన్షన్ వెంటనే విడుదల చేయాలని, గ్రేటర్ వరంగల్‌లో మంజూరైన పెన్షన్లకు బడ్జెట్ కేటాయించాలని వారు డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని వితంతువులు ఆరోపించారు.