పరకాలలో బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ లోకి, ఎన్నికల వేళ కీలక పరిణామం

264చూసినవారు
పరకాలలో బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ లోకి, ఎన్నికల వేళ కీలక పరిణామం
పరకాల పట్టణంలోని 9వ వార్డుకు చెందిన బీఆర్ఎస్ నాయకులు, పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే వారికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఆకర్షితులై స్వచ్ఛందంగా చేరుతున్నారని, రానున్న మున్సిపల్ ఎన్నికల్లో పరకాలలో కాంగ్రెస్ జెండా ఎగరవేద్దామని ఆయన కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీలోకి చేరిన వారిలో క్యాతం సమ్మయ్య, అడికిచర్ల పరమేష్, సాంబయ్య, మహేందర్రెడ్డి, హసీమియా, పంచగిరి శ్యామ్ తదితరులు ఉన్నారు. కాంగ్రెస్ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలని సూచించారు.

సంబంధిత పోస్ట్