విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్న పోరుబాటకు సంబంధించిన పోస్టర్‌ను పశ్చిమ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్, తూర్పు మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్, పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు
కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతోందని, ఫీజు రీయింబర్స్‌మెంట్ కింద సుమారు రూ.8 వేల కోట్ల బకాయిలను చెల్లించకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా
విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా, పరకాలలో ఈ సంఘటన జరిగింది.