మధ్యప్రదేశ్ కు చెందిన శివప్రసాద్ మోతె (26) పరకాల శివారులో కారు ఢీకొని మృతి చెందాడు. కిరాణ సామాను కోసం ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో వాహనం వెనుక ఉన్న సంజయ్ నాగేశ్వర్ కుడి కాలు విరిగిపోయింది. శివప్రసాద్ మోతె కొంతకాలంగా నడికూడ మండలం చెర్లపల్లి గ్రామంలో సుతారి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.