నిందితులను పట్టుకోవడంలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని ఆత్మకూర్ ఇన్స్పెక్టర్ సంతోష్ తెలిపారు.
ఈ మేరకు హన్మకొండ జిల్లా ఆత్మకూరు మండలం పెద్దాపూర్ లో సోమవారం సీసీ కెమెరాల ఏర్పాటుపై గ్రామస్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ సంతోష్ మాట్లాడుతూ ఒక సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమని గ్రామస్థులకు తెలిపారు.