ఎండ తీవ్రత అధికంగా ఉండటంతో, వ్యవసాయ పొలాలు, నివాస గృహాలలో అగ్ని ప్రమాదాలు సంభవించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండి కింది సూచనలు పాటించాలని పోలీస్ శాఖ తరఫున గీసుకొండ సీఐ విష్వేశ్వర్ విజ్ఞప్తి చేసారు. పొలాల్లో ఎండిపోయిన గడ్డి, పరకలు, చెత్తను పోగు చేసి కాల్చకూడదు. పంట అవశేషాలను నియంత్రణ లేకుండా దహనం చేయరాదన్నారు.
విద్యుత్ తీగలు, ట్రాన్స్ఫార్మర్లు సమీపంలో పొలాల పనులు జాగ్రత్తగా నిర్వహించాలి. పొలాల్లో పని చేసే సమయంలో సిగరెట్లు, బీడీలు కాల్చరాదు అన్నారు.