హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి న్యూశాయంపేట పోచంపల్లి ప్రభుత్వ పాఠశాలలోని అంగన్వాడీ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. చిన్నారులకు సులభంగా అర్థమయ్యేలా చార్టులు, బొమ్మలు, ఆట వస్తువులు వినియోగిస్తూ నాణ్యమైన బోధన అందించాలని ఆమె సూచించారు. అంగన్వాడీ టీచర్ రమను చిన్నారుల హాజరు వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం చిన్నారులతో నేరుగా మమేకమై, వారి అభ్యసన సామర్థ్యాన్ని పరిశీలించారు. ఉపాధ్యాయుడిలా బోర్డుపై ఆంగ్ల అక్షరాలు రాసి, వాటిని గుర్తించగలరా అని అడిగి తెలుసుకున్నారు.