హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్, ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే ప్రజలకు మెరుగైన, నాణ్యమైన వైద్య సేవలు అందించాలని వైద్యులు, సిబ్బందిని ఆదేశించారు. పరకాల పట్టణంలోని సమగ్ర అత్యవసర ప్రసూతి-శిశు ఆరోగ్య కేంద్రం (ఏరియా ఆసుపత్రి)ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. తనిఖీలో భాగంగా ఓపీ నమోదును పరిశీలించి, రోగుల వివరాలను ఎలా నమోదు చేస్తున్నారనే విషయాన్ని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం మెడికల్ ఆఫీసర్ గది, ఇన్‌పేషెంట్ వార్డులను పరిశీలించారు.