దామెర: ఎమ్మార్పీఎస్ జెండా గద్దె నిర్మాణ పనులు ప్రారంభం

70చూసినవారు
దామెర: ఎమ్మార్పీఎస్ జెండా గద్దె నిర్మాణ పనులు ప్రారంభం
హన్మకొండ జిల్లా పరకాల నియోజకవర్గం దామెర మండలంలో జులై 7న ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గద్దె నిర్మాణం పనులను శుక్రవారం రాత్రి దామెర మండల ఎమ్మార్పీఎస్ నాయకులు ప్రారంభించారు. జులై 7న ఆవిర్భావ దినోత్సవం వేడుకలు, పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ జన్మదిన వేడుకలు విజయవంతం చేద్దామని పిలుపు నిచ్చారు. కార్యక్రమంలో దామెర మండల గ్రామ శాఖ అధ్యక్షులు వేల్పుల శ్రీను, కొడకండ్ల శ్రీను ఎమ్మార్పీఎస్ నాయకులు తదితరులు ఉన్నారు.