గీసుగొండ: ఫోక్సో కేసులో శిక్ష పడటంలో కృషి చేసిన అధికారులకు సత్కారం

64చూసినవారు
గీసుగొండ: ఫోక్సో కేసులో శిక్ష పడటంలో కృషి చేసిన అధికారులకు సత్కారం
గీసుగొండ పోలీస్ స్టేషన్ పరిధిలో బాలికపై అత్యాచారం కేసులో నిందితుడికి జీవిత ఖైదీ శిక్ష పడడంలో కృషి చేసిన వారికి మంగళవారం సాయంత్రం ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్ సత్కరించారు. వీరిలో పబ్లిక్ ప్రాసిక్యూటర్లు రవికిరణ్ మర్రి వాసుదేవ రెడ్డి, భరోసా లీగల్ అడ్వైసర్ నీరజ, ఏసీపీ తిరుపతి, సీఐ బాబూలాల్, మహేందర్, హెడ్ కానిస్టేబుల్ విజేందర్, కానిస్టేబుళ్లు శ్రవణ్, యుగంధర్, తదితరులు ఉన్నారు.