పరకాల సబ్‌జైలును తనిఖీ చేసిన జువైనల్ జస్టిస్ బోర్డు సభ్యులు

6చూసినవారు
పరకాల సబ్‌జైలును తనిఖీ చేసిన జువైనల్ జస్టిస్ బోర్డు సభ్యులు
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పరకాల సబ్‌జైలును జువైనల్ జస్టిస్ బోర్డు సభ్యులు మేరుగు సుభాష్, డి. పి. ఓ. రమణమూర్తి మంగళవారం సందర్శించారు. జైలు పరిసరాలు, రిజిస్టర్లు, బ్యారక్‌లను పరిశీలించి, 18 ఏళ్లలోపు బాలలను సబ్‌జైల్లో ఉంచరాదని, అలాంటి వారిని వెంటనే జువైనల్ హోంకు తరలించాలని సూచించారు. నిరుపేద ఖైదీలకు లీగల్ ఎయిడ్ ద్వారా న్యాయ సహాయం అందించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జైలు సూపరింటెండెంట్ ప్రభాకర్ రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్