లబ్ధిదారులకు జాప్యం లేకుండా రుణాలను అందించాలి: కలెక్టర్

2చూసినవారు
హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి, ప్రాధాన్యత రంగాలకు, ముఖ్యంగా పంట రుణాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని బ్యాంకర్లను ఆదేశించారు. 2025-2026 వార్షిక సంవత్సరానికి గాను బ్యాంకులు ఇచ్చిన రుణాలపై జిల్లా స్థాయి సమీక్ష కమిటీ (డిఎల్‌ఆర్‌సి), జిల్లా సంప్రదింపుల కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, లబ్ధిదారులకు సకాలంలో రుణాలు అందించాలని సూచించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో జిల్లా రుణ లక్ష్యం 15484.29 కోట్లు కాగా, ఇప్పటివరకు 13733.74 కోట్ల రుణాలు మంజూరు చేసినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్