వరంగల్‌లోని సంగెం మండలంలో ఆశాలపల్లి గ్రామ పంచాయతీ స్థానం ఎస్సీ మహిళకు రిజర్వ్ కావడంతో, ఆ ఊరిలో ఉన్న ఏకైక ఎస్సీ మహిళా ఓటరు కొంగర మల్లమ్మ ఏకగ్రీవంగా సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. పంచాయతీలో 1,600 పైగా ఓటర్లు ఉన్నప్పటికీ, రిజర్వేషన్ కారణంగా మల్లమ్మ ఒక్కరే అభ్యర్థిగా నిలిచారని ఎంపీడీవో రవీందర్ తెలిపారు. అన్ని పార్టీల నాయకులు ఆమెను తమ పార్టీలో చేర్చుకోవాలని ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం.