శాయంపేట మండలం కొత్తగట్టు సింగారం గ్రామానికి చెందిన ఆలేటి బుచ్చివీరు అనే వ్యక్తి కనిపించకుండా పోయినట్లు కుటుంబ సభ్యులు గత నెల 27న పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు, ఈనెల 2న గ్రామ శివారులోని చెట్టుకు బుచ్చివీరు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించారు. ఈ విషయాన్ని ఎస్సై పరమేశ్వర్ తెలిపారు.