గురువారం ఉదయం 11 గంటలకు పరకాల పట్టణంలో ఎమ్మెల్యే విస్తృత ప్రచారం నిర్వహించారు. 12, 21వ వార్డులలో స్ట్రీట్ కార్నర్ ప్రసంగాలు చేస్తూ, పరకాలను మోడల్ మున్సిపాలిటీగా మార్చడమే తన లక్ష్యమని తెలిపారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ చేపట్టిన అభివృద్ధిని గుర్తించి ఓటేయాలని ప్రజలను కోరారు. పరకాల గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరవేయడానికి కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు.