ఆగ్రంపహాడ్ గ్రామం అంగన్వాడి భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

1చూసినవారు
ఆత్మకూరు మండలం ఆగ్రంపహాడ్ గ్రామంలో మహిళా శక్తి వారోత్సవాల సందర్భంగా అంగన్వాడీ భవనాన్ని హనుమకొండ జిల్లా అధ్యక్షులు, కూడా చైర్మన్ ఇనుగాల వెంకటరామిరెడ్డి తో కలిసి పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా చిన్నారులకు అక్షరాభ్యాసం, అన్న ప్రసన్న కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ, పిల్లల భవిష్యత్తుకు అంగన్వాడీలు బలమైన పునాది అని, గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు, బాలల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు.