ఉమ్మడి వరంగల్ జిల్లా, పరకాల పట్టణాన్ని 15-20 రోజుల్లో క్లీన్ సిటీగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక డ్రైవ్ చేపడుతున్నట్లు ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి తెలిపారు. మున్సిపల్ సమీక్షా సమావేశంలో వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా, డ్రైనేజీ నిర్వహణపై అధికారులను ఆదేశించారు. 2027 డిసెంబర్ నాటికి అన్ని వార్డుల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులు పూర్తి చేయడమే లక్ష్యమని చెప్పారు. పరకాల అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ ప్రారంభమైంది.