ప్రత్యేక పూజల్లో పాల్గొన్న నిమ్స్ లైజనింగ్ అధికారి

1చూసినవారు
ప్రత్యేక పూజల్లో పాల్గొన్న నిమ్స్ లైజనింగ్ అధికారి
గీసుకొండ మండలం ఏలుకుర్తి హవేలి గ్రామంలో వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు విజ్ఞేశ్వర యూత్ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ గణేష్ ఉత్సవాల సందర్భంగా నిమ్స్ హాస్పిటల్ లైజనింగ్ అధికారి, హౌసింగ్ సొసైటీ ఛైర్మన్ డాక్టర్ మార్త రమేష్ తన స్వగ్రామమైన ఏలుకుర్తి హవేలిలోని వినాయక మండపాన్ని సందర్శించి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ​ఈ సందర్భంగా అర్చకులు భాగావతుల ఉమామహేశ్వర శర్మ గణపతి హోమంతో పాటు, శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు జరిపించి, తీర్థప్రసాదాలు అందజేశారు.

సంబంధిత పోస్ట్