పరకాల ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించే లక్ష్యంతో, నూతనంగా నిర్మించిన 100 పడకల ఏరియా ఆసుపత్రిని త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్‌తో కలిసి నిర్వహించిన ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఆరోగ్యశ్రీ నిధులు రూ. 79.18 లక్షలతో వైద్య పరికరాలు, అత్యవసర మందులు కొనుగోలు చేయాలని సూచించారు. రికార్డుల నిర్వహణపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ, మార్కెట్ భవన నిర్మాణ పనులను కూడా వేగవంతం చేయాలని మున్సిపల్ కమిషనర్‌కు ఆదేశించారు.