పరకాల నియోజకవర్గం శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి కృషి తో పరకాల మండలం నాగారం లో పేదవాడి సొంతింటి కల నెరవేరిందని పరకాల మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నారు. సోమవారం మంజూరైన ఇళ్ల నిర్మాణ పనులకు భూమి పూజ చేసిన పనులను ప్రారంభించారు. కార్యక్రమంలో నాగారం గ్రామ మాజీ సర్పంచ్ కట్కూరి స్రవంతి-దేవేందర్ రెడ్డి దంపతులతో పాటు పరకాల మండల కాంగ్రెస్ నాయకులు పలువురు పాల్గొన్నారు.