తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడి ఉద్యోగులు గ్రామాల్లో, పట్టణాల్లో ఏర్పాటు చేసిన కేంద్రాలలో ఐదు సంవత్సరాల లోపు పిల్లలకు పోలియో చుక్కలు వేయనున్నారు. కాకతీయ యూనివర్సిటీ రజక విద్యార్థి విభాగం ఇంచార్జి కొరపల్లి రాజేష్ మాట్లాడుతూ, పుట్టిన పసి గుడ్డు నుండి ఐదు సంవత్సరాల లోపు పిల్లలకు పోలియో చుక్కలు తప్పనిసరిగా వేయించాలని, తల్లిదండ్రులు పిల్లల ఆరోగ్య విషయంపై జాగ్రత్తగా ఉండాలని కోరారు. ఉమ్మడి వరంగల్ జిల్లా, పరకాలలో ఈ కార్యక్రమం జరుగుతోంది. నిండు జీవితానికి రెండు చుక్కలు అనే నినాదంతో ఈ కార్యక్రమం చేపట్టారు.