ప్రజల ఫిర్యాదుల సత్వర పరిష్కారానికి సోమవారం జిల్లా కలెక్టరేట్‌లో జిల్లా స్థాయి, హన్మకొండ, పరకాల రెవెన్యూ డివిజన్ కార్యాలయాల్లో డివిజన్ స్థాయి ప్రజావాణి కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి తెలిపారు. ప్రజలు తమ సమస్యలకు సంబంధించిన వినతిపత్రాలతో హాజరుకావాలని, అందిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కారానికి అధికారులు చర్యలు తీసుకుంటారని కలెక్టర్ సూచించారు.