హనుమకొండలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి సమన్వయ కమిటీ సభ్యులు, ముఖ్య నాయకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కష్టపడ్డ ప్రతి
కాంగ్రెస్ కార్యకర్తకు గుర్తింపు, గౌరవం లభించేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా పథకాలను విస్తృతంగా ప్రచారం చేసి ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. మండల, గ్రామ అధ్యక్షుల పదవులకు ఎంపికైన వారికి గౌరవం ఇవ్వాలని, గ్రామాలలోని ప్రతి కార్యకర్త అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని తెలిపారు.