పరకాలలోని 22వ వార్డుకు చెందిన బీఆర్ఎస్, బీజేపీ నాయకులు ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వీరు స్వచ్ఛందంగా పార్టీలో చేరుతున్నారని తెలిపారు. పరకాల మున్సిపాలిటీ ఎన్నికల్లో సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.