ఊరుగొండలో పేకాట ఆడుతున్న ఏడుగురి అరెస్ట్

1చూసినవారు
ఊరుగొండలో పేకాట ఆడుతున్న ఏడుగురి అరెస్ట్
దామెర మండలంలోని ఊరుగొండలో పేకాట శిబిరంపై పోలీసులు దాడి చేసి ఏడుగురు పేకాటరాయుళ్లను అరెస్ట్ చేశారు. ఊరుగొండ గ్రామానికి చెందిన పలువురు పేకాట ఆడుతున్నారన్న సమాచారం మేరకు ఎస్సై కొంక అశోక్ నేతృత్వంలో దాడి జరిగింది. మేకల రవీందర్, మేకల రాజు, జన్ను దయాకర్, పోలెపాక రమేశ్, మేకల బాబు, పోలెపాక కరుణాకర్, పోలెపాక కాంత్రికుమార్ లను అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి రూ. 7, 580 నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు.

ట్యాగ్స్ :