నందనాయక్ తండాకు చెందిన బదావత్ రేణుకపై లైంగిక దాడి

566చూసినవారు
నందనాయక్ తండాకు చెందిన బదావత్ రేణుకపై లైంగిక దాడి
గీసుగొండ మండలం నందనాయక్ తండాలో ఇరువర్గాలపై కేసు నమోదు చేసినట్లు సీఐ మహేందర్ సోమవారం రాత్రి తెలిపారు. నందనాయక్ తండాకు చెందిన బదావత్ రేణుకపై అదే తండాకు చెందిన బదావత్ రవి లైంగిక దాడి చేయబోయాడు. వెంటనే ఆమె కేకలు వేయడంతో రవి పారిపోయాడు. రేణుక కుటుంబ సభ్యులు రవి, అతడి భార్య మానస, తల్లిపై దాడి చేశారు. ఇంట్లో ఉన్న ఫర్నిచర్ ను ధ్వంసం చేశారని ఇరువర్గాల పై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.