కేసీఆర్ కు సిట్ నోటీసులు: బీఆర్ఎస్ నేతల నిరసన, సీఎం దిష్టిబొమ్మ దహనం

283చూసినవారు
తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కు కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ కక్షతో సిట్ నోటీసులు జారీ చేసిందని ఆరోపిస్తూ, పరకాల నియోజకవర్గం నడికుడ మండలంలోని వరికోల్ గ్రామంలో బీఆర్ఎస్ నాయకులు నిరసన ధర్నా నిర్వహించి, సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ విచారణ కేవలం బీఆర్ఎస్ నాయకులను వేధించడానికి, ప్రజల దృష్టిని మళ్లించడానికి వేసిన ఎత్తుగడ అని మాజీ వైస్ ఎంపీపీ చందా కుమారస్వామి అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయలేక, రైతుల రుణమాఫీ, నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో విఫలమైన ప్రభుత్వం, తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి బీఆర్ఎస్ నాయకులపై అక్రమ కేసులు బనాయిస్తోందని ఆయన ఆరోపించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు, బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్