హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ, స్పష్టమైన లక్ష్యంతో కృషి చేస్తే ఉన్నత శిఖరాలను అధిరోహించడం సాధ్యమని అన్నారు. మార్చి 2026లో నిర్వహించిన ఎస్‌ఎస్‌సీ పబ్లిక్ పరీక్షల్లో ఉత్తమ
ఫలితాలు సాధించిన జిల్లాలోని 17 ప్రభుత్వ, జెడ్పీ, కేజీబీవీ పాఠశాలల విద్యార్థులకు ప్రత్యేక సత్కార కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా టాపర్ విద్యార్థులను శాలువాలతో సత్కరించి, వారిని అభినందించారు.