ఉమ్మడి వరంగల్ జిల్లా, పరకాలలో సంగెం, గీసుకొండ జోన్ ఆధ్వర్యంలో 70వ క్రీడా పాఠశాలల జోనల్ స్థాయి బాలికల పోటీలు జరిగాయి. ఈ ఎంపిక పోటీల్లో ఉషోదయ హై స్కూల్ విద్యార్థినులు కబడ్డీలో జ్యోతి, సాత్విక, సిరి, తేజస్విని, మానసలు, ఖో ఖోలో హన్సిక, అనన్య, దీపిక, తేజస్వి, భార్గవి జిల్లా స్థాయి పోటీలకు సోమవారం ఎంపికయ్యారు. వీరిని ఉషోదయ హై స్కూల్ డైరెక్టర్ గిరి గాని రాహుల్ వర్మ అభినందించారు. ప్రిన్సిపాల్ చంద్రగిరి మహేష్, వైస్ ప్రిన్సిపల్ వీరన్న, వ్యాయామ విద్య ఉపాధ్యాయులు కుంట విజేందర్, ఉపాధ్యాయ బృందం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.