
'ఓజీ' శాటిలైట్ హక్కులు దక్కించుకున్న ETV
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'OG' సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించింది. దర్శకుడు సుజీత్ తెరకెక్కించిన ఈ స్టైలిష్ గ్యాంగ్స్టర్ యాక్షన్ డ్రామా, పవన్ కళ్యాణ్ నటన ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇప్పటికే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా శాటిలైట్ హక్కులను ప్రముఖ తెలుగు ఎంటర్టైన్మెంట్ ఛానల్ ఈటీవీ భారీ మొత్తానికి సొంతం చేసుకున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. త్వరలోనే వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్గా ప్రసారం చేయడానికి ఛానల్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.




