మొగిలిచర్ల లో మహిళ అదృశ్యం

2చూసినవారు
మొగిలిచర్ల లో మహిళ అదృశ్యం
మొగిలిచర్ల గ్రామానికి చెందిన ఆరూరి లక్ష్మి అనే మహిళ అదృశ్యమైనట్లు గీసుగొండ సీఐ విశ్వేశ్వర్ తెలిపారు. ఈ నెల 19న కుమారుడితో మనస్పర్థలు రావడంతో ఆమె తన తమ్ముడి ఇంటికి వెళ్లి, ఆ తర్వాత కుమార్తె ఇంటికి వెళ్తున్నానని చెప్పి బయలుదేరింది. అయితే, కుమార్తె ఇంటికి చేరుకోకపోవడంతో కుటుంబ సభ్యులు బంధువుల ఇళ్లలో, ఇతర ప్రాంతాలలో వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్