
చెరువులోకి చేప పిల్లలను వదిలిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి
స్టేషన్ ఘనపూర్ రిజర్వాయర్లో కలెక్టర్ తో కలిసి ఎమ్మెల్యే కడియం శ్రీహరి చేప పిల్లలను విడుదల చేశారు. నియోజకవర్గంలో రిజర్వాయర్లు పుష్కలంగా ఉన్నాయని, చేపల పెంపకానికి సరిపడా నీరు ఎప్పుడూ అందుబాటులో ఉంటుందని ఆయన తెలిపారు. వచ్చే ఏడాది నుంచి ఆగస్టు చివరి వారంలోనే చేప పిల్లలను చెరువుల్లోకి వదిలి, మత్స్యకారుల అభివృద్ధికి కృషి చేయాలని అధికారులకు సూచించారు.

































