చిర్ర నాగరాజు గౌడ్ చిల్పూర్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియామకం

0చూసినవారు
చిర్ర నాగరాజు గౌడ్ చిల్పూర్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియామకం
ఉమ్మడి వరంగల్ జిల్లా పాలకుర్తి, స్టేషన్ ఘన్ పూర్ ప్రాంతంలో చిల్పూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా చిర్ర నాగరాజు గౌడ్‌ను పార్టీ అధిష్ఠానం అధికారికంగా ప్రకటించింది. ఈ నియామకంపై స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి నాగరాజు గౌడ్‌ను శాలువాతో బుధవారం సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. పార్టీని మరింత బలోపేతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలతో కలిసి ముందుకు సాగాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో చిల్పూర్ గుట్ట దేవస్థాన చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్ రావు, పల్లగుట్ట సర్పంచ్ ఎనగందుల నరసింహారెడ్డి, చిల్పూర్ గుట్ట డైరెక్టర్ రత్నాకర్ రెడ్డి, మండల యూత్ అధ్యక్షుడు ఇసురం కృష్ణతో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్