వరంగల్ జిల్లా ఘనపూర్ మండలం జిట్టగూడెం తండా గ్రామ పంచాయతీలో సర్పంచ్, వార్డు సభ్యులు అందరూ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తండాలో 515 ఓటర్లు, 8 వార్డులు ఉండగా, పార్టీలకు అతీతంగా గ్రామస్తులు అందరినీ ఏకతాటిపై ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సర్పంచ్ బానోతు బాలు నాయక్, వార్డు సభ్యులను ఈ నెల 3న ఏకగ్రీవం అయినట్లుగా అధికారులు ప్రకటించనున్నారు. ఈ నేపథ్యంలో గ్రామస్తులు సంబరాలు చేసుకున్నారు.