వడ్ల కనుగొలు కేంద్రం నూ ఆకస్మిక తనిఖీ చేసిన మాజీ ఎమ్మెల్యే

946చూసినవారు
స్టేషన్ ఘనపూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఫతేపూర్, గార్లగడ్డ తండా గ్రామ పరిధిలోని పిఎసిఎస్ కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. రైతుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న రైస్ మిల్లర్లు, పిఎసిఎస్ అధికారులపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 15 రోజులుగా రైతులు వడ్లు ఆరబెట్టుకున్నా, కేవలం రెండు లారీలు మాత్రమే తరలించబడ్డాయని, ఇంకా 118 మంది రైతుల కల్లాల్లో వడ్లు అలాగే ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. వెంటనే వడ్ల కొనుగోలు చేపట్టాలని పిఎసిఎస్ సీఈఓను ఆయన హెచ్చరించారు.
Job Suitcase

Jobs near you