ఉమ్మడి వరంగల్ జిల్లా, వర్ధన్నపేట, స్టేషన్ గన్ పూర్ లోని ధర్మసాగర్ మండల్ సాయిపేట క్రాస్ వద్ద ఇటీవల దాడిలో గాయపడిన వేలేరు మండల
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మురావత్ లక్ష్మణ్ నాయక్‌ను మాజీ ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే కడియం శ్రీహరి పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, దాడికి పాల్పడిన నిందితులకు కఠిన శిక్ష పడేలా చూస్తామని భరోసా ఇచ్చారు. లక్ష్మణ్ నాయక్ అధైర్యపడొద్దని, పార్టీ మరియు తాను ఎల్లప్పుడూ అండగా ఉంటామని శ్రీహరి హామీ ఇచ్చారు.