కాజీపేట పరిధిలో అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. వారి నుంచి రూ. 70,000 విలువైన గంజాయి, రవాణాకు ఉపయోగించిన ఆటోను స్వాధీనం చేసుకున్నారు. కాజీపేట ఉమెన్ ఎస్సై మౌనిక తన సిబ్బందితో కలిసి పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా, కడిపికొండ బ్రిడ్జి కింద అనుమానాస్పదంగా కనిపించిన వారిని పోలీసులు వెంబడించి పట్టుకున్నారు. ఈ ఘటనలో ఇద్దరు నిందితులు అరెస్ట్ అయ్యారు.